India Has Become 4th Largest Economy, Ahead Of Japan | No.1 Spot Coming Soon | Ntv

ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఆస్థానంలో ఉన్న జపాన్ దేశాన్ని భారత్ కిందికి నెట్టింది. ప్రెజెంట్ భారతదేశం కంటే అమెరికా చైనా జర్మనీ మాత్రమే ముందున్నాయి. త్వరలోనే టాప్ త్రీ లోకి భారత్ ఎంటర్ అవుతుందని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. జపాన్ ను అధిగమించి భారత్ నాలుగవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి ఆయోగ్ సఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రస్తుతం మనం నాలుగు ట్రిలియన్ డాలర్స్ విలువైన నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఐఎంఎఫ్ డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ కంటే పెద్దది అన్నారు. అమెరికా, చైనా, జర్మనీ భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రణాళికలకు మనం కట్టుబడి ముందుకు సాగితే వచ్చే రెండున్నర నుంచి మూడేళ్లలో భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని బివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వ areర్ దఫోth largజస్ట్ ఎeconమీ యస్ ఐస్పీక్వ areర్ a 4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్ఐక్ అండ్ ఇస్ నాట్ మై డేataా దిస్ ఇస్ ఐఎఫ్ డేataఇండియాటుడే is larger thన్జపాన్ soఇట్స్ onన్ly unైటెడ్ stేట్స్ chైina అండ్ gerర్మy whichచ్ areర్ larger and if we stick to you know what is being plan what is being thoughట్ though it matter one of the 2/2 yearయర్స్ we would become the third largest economy ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోంది. ఇప్పుడు మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గటం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారించడం వంటి చర్యలు చాలా కీలకం. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలంటే రాష్ట్రాలే కీలకమని ప్రధాని మోడీ చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు వాటి స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని ప్రధానమంత్రి ఇప్పటికే పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి, సేవలు, వ్యవసాయం, ప్రజల ఆర్థిక వృద్ధి వంటివి అన్ని రాష్ట్రాల్లోనూ జరగాలి. శుక్రవారం జరిగిన నీతి ఆయోగ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు విజన్ డాక్యుమెంట్స్ ను విడుదల చేశయి. మరో 12 రాష్ట్రాలు ఆగస్టు నాటికి విడుదలకు సిద్ధమవుతున్నాయి. 2010 నాటికి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్ట్ లో భారత్ 10వ స్థానంలో ఉండేది. 2019 లో బ్రిటన్ ను వెనక్కినెట్టి ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఆరేళ్లలోనే నాలుగవ స్థానానికి ఎగబాకింది. 2026 ఆర్థిక సంవత్సరానికి జీడిపి దాదాపు 4,187.017 017 బిలియన్ డాలర్స్ కు చేరుకుంటుందని ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక అంచనా వేసింది. ఇది జపాన్ జీడిపి కంటే కొంచెం ఎక్కువ భారత ఆర్థిక వ్యవస్థ 2025 లో 6.2% 2026 లో 6.3% వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనాలు ఉన్నాయి. 2025 లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8% 2026 లో 3%ా ఉంటుందని ఐఎంఎఫ్ భావిస్తోంది.

India 4th Largest Economy | India Has Become 4th Largest Economy, Ahead Of Japan | No.1 Spot Coming Soon | Ntv
#india #indianeconomy #pmmodi
For more latest updates on the news :
► Visit Our Website : https://ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m
► Like us on Facebook: https://www.facebook.com/NtvTeluguLive/
► Follow us on Twitter At https://twitter.com/ntvtelugulive

Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India’s first women’s channel Vanitha TV, and India’s most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #BreakingNews #Headlines #TodayHeadlines #TopNews #PrimeNews #SpeedNews

5 Comments

  1. చెవిలో అమృతం పోసినట్లు ఉంది త్వరలో వరల్డ్ no 1 కావాలని ఆకాంక్షిస్తునను

  2. ఎలా? జపాన్ వాళ్ళ ప్యాలెస్ కన్నా నా గుడిసె రేటు ఎక్కువ, జపాన్ వాళ్ళ సూటు కన్నా నా గోచి విలువ ఎక్కువ